నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది పటాస్ సినిమా. 2015 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచింది. కళ్యాణ్‌కు కేరీర్ పరంగా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమాతోనే కళ్యాణ్ దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తోన్న హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి అనే మాస్ డైరెక్టర్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు.
ఈ మాస్ మసాలా మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాలని డ్యాన్స్ డైరెక్టర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ ట్రై చేశాడు.
అక్కడ పటాస్ బాగా పేలుతుందని అందరూ భావిస్తే తుస్సుమని పేలిపోయింది. కోలీవుడ్‌లో ఈ సినిమా కనీసం సౌండ్ కూడా చేయలేదు. ఈ సినిమా ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఇక్కడ కళ్యాణ్‌రామ్ రోల్‌ను లారెన్స్ చేస్తే, సాయికుమార్ రోల్‌ను కట్టప్ప సత్యారాజ్ పోషించారు. మెట్ట శివ – కెట్ట శివ పేరుతో వచ్చిన ఈ సినిమాలో తెలుగులో కృష్ణాష్టమి లాంటి డిజాస్టర్ లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీ నటించింది. తెలుగు ఫీలింగ్ తమిళ్లో లేకపోవడంతో సినిమా అక్కడి ప్రేక్షకులకు నచ్చలేదు.
నిక్కీ గల్రానీ లంగా ఓణి వేసుకుని చూపించాల్సిందంతా చూపించినా ఫలితం లేదు. కోలీవుడ్ వెబ్ సైట్లు అన్ని మెట్ట శివ – కెట్ట శివకు 1 / 5 రేటింగ్‌తో సరిపెట్టాయంటే ఈ సినిమా ఎంత డిజాస్టరో అర్థమవుతోంది.