టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ ఎలాంటి మీమ్స్, ట్రోల్స్ లేకుండా అందరూ ఆడియన్స్ కు నచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మొదట వినిపించే పేరు విక్టరీ వెంకటేష్. సీనియర్ హీరోల్లో ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఎవరి అభిమానులు వాళ్ళ సినిమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. కానీ.. వెంకీ మామ సినిమాకు మాత్రం ఆ స్టార్ హీరోలు సైతం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి కంటెంట్ ఎంచుకోవడంలో వెంకటేష్ నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకున్నాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకోవడంలో తనదైన స్టైల్ తో సత్తా చాటుకున్న వెంకటేష్.. విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అంతటి మంచి ఇమేజ్ను ఒక్కసారిగా కుదిపేసిన రోల్ ఏదైనా ఉందంటే.. రానా నాయుడులో వెంకటేష్ పాత్ర.నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఒరిజినల్ సిరీస్.
ఇందులో బాబాయ్, అబ్బాయి.. రానా, వెంకటేష్‌లు తండ్రి కొడుకులుగా మెరిశారు. ఇద్దరు కలిసి సీరీస్‌లో కనిపించారని ఆనందపడేలోపే.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కావడంతో.. సినిమాల్లో లిమిట్ క్రాస్ చేసి బూతులు, బోల్డ్ కంటెంట్‌తో ఆడియన్స్‌కు విసుగు తెప్పించారు. అసలు మా వెంకటేష్ అన్నా.. ఇలాంటి పదాలు వాడింది. ఇంత వల్గర్ గా మాట్లాడింది.. అని అభిమానులు నిరాశపడేలా చేశారు. ఈ సిరీస్ కారణంగా మొట్టమొదటిసారి వెంకటేష్ కెరీర్లో ట్రోలింగ్స్‌కు గురయ్యాడు. నెగటివ్ కామెంట్స్ చెవి చూసాడు. ఈ క్రమంలోనే తర్వాత ఈ సిరీస్ చేయకుండా ఉండాల్సిందని రియలైజ్ అయిన సీజన్ 2 కూడా తప్పక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే.. రానా నాయుడు సీజన్ 2 లోను ఆయన నటించాడు. ఇక ఈ సీజన్ 2 త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది. నాగ నాయుడు రోల్లో వెంకటేష్ అన్న సంగతి తెలిసిందే. తండ్రీ, కొడుకుల మధ్య జరిగే యుద్ధం తారా స్థాయికి చేరుకున్నట్లు మొదట్లో క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో కొడుకు కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయిన నాగ నాయుడు.. ప్రాబ్లంలో ఉన్నాడని తెలుసుకొని మళ్లీ వెనుతిరిగి వస్తాడు అనే లైన్ తో సీజన్ వన్ పూర్తి చేశారు. జూన్ 13 నుంచి రానా నాయుడు.. సీజన్ 2 ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు వెంకటేష్ టీం. తాజాగా.. తన పాత్ర ఆయిన నాగ నాయుడు గురించి వెంకటేష్ వివరించాడు. రియల్ లైఫ్‌లో తనకి, నాగకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన ఆయన.. నాగ నాయుడు ఓ సెల్ఫీష్ మ్యాన్. నేనెప్పుడూ బయట అలా ఉండనంటూ చెప్పుకొచ్చాడు. ఎలా ఉన్నా నాగ కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తాడు.. ఎన్ని తప్పులు అయినా చేస్తాడు.. ఆ పాయింట్ నచ్చడంతోనే నేను ఆ పాత్రలో నటించా.. రియల్ లైఫ్ లో నాకు మైండ్ గేమ్స్ ఆడటం అసలు నచ్చదని.. సిరీస్‌లో మాత్రం నాగ నాయుడు అలాంటి మైండ్ గేమ్స్ బాగా ఆడతాడు అంటూ వివరించాడు. బయట నేను ఎప్పుడు ఎలా ఉంటానో అందరికీ తెలుసు. కానీ.. నాగ ఎప్పుడు ఏది చేస్తాడు ఎవరికి అర్థం కాదు అంటూ వివరించాడు. ఈ నేపథ్యంలోనే 2 సీజన్ లో కూడా.. వెంకీ రోల్ బూతులతో నిండిపోతుందా.. లేదా స్టోరీని కాస్తైనా మార్చాడా అనేది తెలియాలంటే.. రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.