టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలంపాటు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం నిర్మాతగా మారి మరోసారి తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి.. గ్రాండ్ లెవెల్లో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. కాగా.. గత కొంతకాలంగా సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించిన.. క్లోజ్ ఫొటోస్ సైతం వైరల్ గా మారుతున్నాయి.
చివరిగా విమానంలోనూ రాజ్నిడమోరుతో సమంత క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ను షేర్ చేయడంతో.. ఇది చూసిన నెటిజన్స్.. వీరిద్దరూ కచ్చితంగా రిలేషన్ లో ఉన్నారని.. దానిని ఈ ఫోటోతో కన్ఫర్మ్ చేశారంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై అటు సమంతా కానీ.. ఇటు రాజ్ నిడమొరు కానీ.. ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఇలాంటి క్రమంలో.. తాజాగా సమంత షేర్ చేసిన వీడియో మరోసారి వీరి రూమర్ వార్తలు ఇచ్చినట్లు అయింది. హ్యాపీ వీకెండ్ అంటూ అతనితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో క్లిప్‌ను సమంత షేర్ చేసుకుంది. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న కొన్ని వీడియోలు.. ఫోటోలతో పాటు.. రాజ్ నిడమర్రుతో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న క్లిప్‌ను సైతం ఇందులో పంచుకుంది.
అయితే కోర్ట్‌లో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా గేమ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో మరోసారి నెటిజన్లు వీళ్ళిద్దరి రిలేషన్ గురించి చర్చలు వైరల్ గా మారుతున్నాయి. ఇక సమంత శుభం సినిమా రిలీజ్‌కు ముందు కూడా రాజ్ నిడమోరుతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాజ్ నిడమోరు భార్య మాత్రం రకరకాల కొటేషన్లను షేర్ చేస్తూ నెటిజన్ల సందేహాలను మరింతగా పెంచుతుంది. అయితే అసలు మ్యాటర్ మాత్రం ఇప్పటివరకు రివీల్ కాలేదు. సమంత, రాజ్నిడమూరు ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వెబ్ సిరీస్ లతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక సమంత నిర్మించిన శుభం సినిమాకు కూడా రాజ్ నిడమోరు ప్రొడ్యూసర్ గా పని చేశాడు. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలో వీరిద్దరిపై వచ్చే రూమర్ వార్తలకు ఎవరైనా చెక్ పెడతారేమో వేచి చూడాలి.
View this post on Instagram