ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎంతోమంది.. స్టార్ హీరోలుగా తమను.. తాము ప్రూవ్ చేసుకోవడానికి.. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకోవడానికి.. అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మెచ్చే.. ఆడియన్స్ కు నచ్చే కంటెంట్‌ను ఇచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌ను నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టిన సంగతి తెలిసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరో సైతం.. పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవడానికి కష్టపడుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ భాషలోనే నటిస్తూ.. తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న మహేష్ బాబు సైతం.. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 తో.. ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు, నమ్రతలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. మహేష్.. నమ్రత ఇద్దరూ ప్రేమించి వివాహం చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కంటే ముందు ఆయనను ప్రేమిస్తున్న విషయం.. నమ్రత మరో టాలీవుడ్ స్టార్ హీరోతో షేర్ చేసుకుందట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. గతంలో చిరు, నమ్రత.. అంజి సినిమాలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా.. కమర్షియల్‌గా సక్సెస్ అందుకోకపోయినా.. దర్శకుడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతేకాదు.. నమ్రత, చిరు నటనపై విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. అయితే.. ఈ సినిమా రిలీజ్ టైం లో నమ్రత.. మహేష్ ని ప్రేమిస్తున్న విషయం చిరంజీవితో చెప్పేసిందట.
అప్పటికే మహేష్, నమ్రతలు కలిసి వంశీ సినిమాను నటించారు. అయితే నమ్రత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పాలో తెలియక.. చిరంజీవి ఏదైనా సహాయం చేస్తారని ఆయనతో వివరించిందట. ఇక ఈ విషయంలో చిరంజీవి సైతం కృష్ణ గారికి చెప్పి.. వాళ్ళ పెళ్లికి ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారని.. అప్పట్లో తెగ వార్తలు వైరల్ అయ్యేవి. ఆయన అసలు ససేమేరా ఒప్పుకోలేదట. దీంతో ఏం చేయాలో తెలియని మహేష్.. నమ్రత తో కలిసి బయటకు వెళ్లి ఆమెను వివాహం చేసుకున్నారు. తర్వాత మళ్లీ కృష్ణనే వాళ్ళను ఆహ్వానించి.. రిసెప్షన్ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఇక తమ మ్యారేజ్ విషయంపై నమృత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా పెళ్లి జరగడానికి చిరంజీవి కూడా ఓ ముఖ్య కారణం అంటూ వెల్లడించింది.