నాలుగేళ్లకే సినీ ఎంట్రీ, టీనేజ్ లోనే పెళ్లి, భర్త వేధింపులతో నరకం.. కట్ చేస్తే..

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్‌ల జీవితం పూల‌పాన్పు అని.. అగ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటార‌ని.. రకరకాలుగా ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు జనం. కానీ.. అందరి లైఫ్ ఒకేలా ఉండదు. ఇండస్ట్రీలో స్టార్ డం సంపాదించుకున్న వారి జీవితాల్లోనూ ఎన్నో ఊహించని విషాదాలు నిండి ఉంటాయి. చెప్పుకోలేని కష్టాలు దాగి ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా.. ఇదే కోవకు చెందుతుంది. కన్నీళ్ళతో మొదలైన ఆమె జీవిత కథ వెండితెరపై అద్భుతాలను సృష్టించి.. తర్వాత అర్ధాంత‌రంగా ముగిసింది. ఇంతకీ ఆ హీరోయిన్ పేరు చెప్పలేదు కదా.. తనే మీనా కుమారి. అసలు పేరు మహాజభిన్‌ భాను. ఆగస్టు ఒకటి 1933లో మీనా కుమారి జన్మించగా.. ఆడపిల్ల పుట్టిందని నిరాశతో ఉన్న తండ్రి.. కనీసం హాస్పిటల్ ప్లీజ్ కూడా కట్టలేని పరిస్థితుల్లో.. మీనా కుమారిని అనాధాశ్రమంలో వదిలేశాడు. అయితే తప్పు తెలుసుకున్న తండ్రి వెంటనే వెళ్లి.. మళ్లీ కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు.

Tragedy Queen', Meena Kumari's Love Life: Separation From Kamal Amrohi To  Turning Into An Alcoholic

కుటుంబ ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతూ నాలుగేళ్ల చిన్న వయసులోనే మహాజభీన్‌ను సినిమాల్లోకి పంపించాడు. ఇక ఆ చిన్న వయసులోనే మహాజభిన్ లెదర్ ఫేస్, అధూరి కహాని, పూజ లాంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. వీటితో పాటు ఏక్ హి భుల్ సినిమాలోనూ నటిస్తున్న సమయంలో విజయ్ భట్.. ఆమెకు బేబీ మీనా అనే పేరు పెట్టాడట. ఆ తర్వాత ఆమె బచ్చోంకా ఖేల్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో మీనా కుమారిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. దాదాపు దశాబ్దకాలం పాటు.. ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా రాణించింది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మడి నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. నటనతో పాటు.. కవయత్రిగా, సింగర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ రాణించిన మీనా కుమారి.. ఎమోషనల్ మాటలతో ట్రాజడీ క్వీన్ గా క్రేజ్‌ను సంపాదించుకుంది.

Meena Kumari unknown facts

30 ఏళ్ల సినీ లైఫ్‌లో 90 పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకున్న 34ఏళ్ళ‌ ప్రముఖ దర్శకుడు కమల్ అమరోహిని.. 18 ఏళ్ల చిన్న వయసులో మూడో వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన తొలినాళ్లల్లో బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట‌ కొద్ది రోజులకే కాపురంలో కల‌హాలు ప్రారంభమయ్యాయి. మీనా కుమారి మీద భర్త చేయి చేసుకోవడం.. మానసికంగా వేధించడంతో.. ఎన్నో స్ట్రగుల్స్ ని ఎదుర్కొంది. తాను ప్రతి చిన్న విషయంలోను అతని మాటే వినాలని అనుకోవడం.. అధిప‌త్యంతో మీనా దాంపత్య జీవితం నరకంగా మారింది. 1964లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఈ బాధతో మీనా కుమారి మద్యానికి బానిస అయ్యింది. మధ్యాని సేవిస్తూ అనారోగ్యానికి గురై మార్చి 3, 1972న 38 ఏళ్ల చిన్న వయసులోనే మీనకుమారి కన్ను మూసింది.