ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ట్రెడిషనల్ బ్యూటీ ఇప్పుడు తను మోడల్ లుక్స్ తో కుర్రాళ్ళు మతి పోగొట్టేస్తున్న క్రేజీ బ్యూటీ.బుల్లితెరపై అందం, అభినయంతోనే కాదు.. అల్లరి మాటల గారడితోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్స్ ఎంతోమంది ఉంటారు. అలా తమదైన కామెడీ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్స్ లో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ఈ అమ్ముడు.. ఓవైపు రియాలిటీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్, మూవీస్ చూస్తూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతుంది.
తన యాక్టీవ్ నెస్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాల్టీషోలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. మొదట షార్ట్ ఫిల్మ్‌లో నటించిన విష్ణు తర్వాత బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. పోవే పోరా షో తో యాంకర్‌గా ఇండస్ట్రీలో ప్రయాణాన్ని మొదలుపెట్టి.. అతితక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత పలు షోలలో యాంకర్ గా చేస్తూ తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గర అయింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇందులో భాగంగానే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ బ్యూటీ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే వరుస షూట్ లలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఫోటోషూట్స్ రీల్స్ అంటూ తెగ సందడి చేస్తుంది. ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్ తోను కవ్విస్తుంది. అలా ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 8 రియాలిటీ షోలో అత్యంత డిమాండ్ ఉన్న కంటిస్టెంట్లలో విష్ణు కూడా ఒకటి. కొన్ని నివేదికల ప్రకారం ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ కూడా విష్ణు ప్రియనే. ఆమెకి ఒక్క వారానికి దాదాపు రూ.5.5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక అమ్మడికి రోజు రోజుకు ఆడియన్స్ సపోర్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సీజన్ టాప్ పై కంటెస్టెంట్ లో ఈమె ఉండనుందని టాక్. ఈ క్రమంలో అమ్మడికి సంబంధించిన ఫోటో నెటింట తెగ ట్రెండ్ అవుతుంది.