ఈ పై ఫోటోలో చూస్తున్న అక్క తమ్ముళ్లు ఎవరో గెస్ చేయగలరా.. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్. వీళ్లలో ఆ ముద్దుగుమ్మ ఇప్పటికే ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ బ్యూటీ. మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ.. ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నాడు. మరో ముఖ్య విషయం ఈ ఇద్దరు కూడా ఓ దివంగత నటి.. పాపులర్ స్టార్ హీరోయిన్ కజిన్స్ కావడం విశేషం. ఇక ఈ పిక్‌లో ఉన్న పాప ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ బ్యూటీ. తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ ఆకట్టుకుంది.
చెన్నైలో పుట్టి పెరిగిన ఈ సోయగం.. తెలుగింటి కోడలుగా వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో గెస్ చేశారా..? సర్లేండి మేమే ఒక క్లూ ఇచ్చేస్తున్నాం.. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ ఏ ఈ బుజ్జి పాపే. ఇప్పటికైనా కనిపెట్టారా..? ఎస్.. ఆమె గులాబీ మూవీ హీరోయిన్ మహేశ్వరి. పక్కనే ఉన్నది తన తమ్ముడు ఉదయ్ కార్తీక్ కుమార్. ప్రస్తుతం సినిమాల్లో ఉదయ అవిషేక్ కార్తీక్ గా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఇద్దరు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కజిన్స్ అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ.. ఇక్కడ మేటర్ ఏంటంటే.. అందరు మహేశ్వరి, శ్రీదేవి.. అక్క, చెల్లెలు అనుకుంటారు. కానీ.. మహేశ్వరి, శ్రీదేవికి కూతురి వరుస అవుతుంది.
భారతీరాజా రూపొందించిన తమిళ్ మూవీ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేశ్వరి.. తన 17 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత సుమన్ ఖైదీ ఇన్స్పెక్టర్ లో ప్రేక్షకులను మెప్పించింది. జెడి చక్రవర్తి తో కలిసి మహేశ్వరి నటించిన గులాబీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. వీరి కాంబోలో దెయ్యం, మృగం లాంటి ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇక పెళ్లి సినిమాతో మహేశ్వరి నటనలో తన సత్తా చాటుకుంది. దీంతో పాటు.. ప్రియురాలు, నవ్వులాట, ఓ సని అయిపోతుంది బాబు, మా బాలాజీ, ప్రేమించేది ఎందుకమ్మా.. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇక రవితేజ తో కలిసి నీకోసం సినిమాలోని నటించిన మహేశ్వరి.. ఈ సినిమాకు నంది అవార్డును అందుకుంది. 2008లో జై కృష్ణ అనే అబ్బాయిని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ఇండస్ట్రీకి మెల్లమెల్లగా దూరమైంది. అప్పుడప్పుడు బుల్లితెరపై మాత్రం సందడి చేస్తుంది. ఇక మహేశ్వరి తమ్ముడు ఉదయ్ అవిషేక్ కార్తీక్.. గౌతమినన్ దగ్గర అసోసియేటివ్‌గా పనిచేసి.. ప్రస్తుతం హీరోగా సినిమాల్లో నటిస్తున్నాడు. సెల్వకుమార్.. తిరుమల డైరెక్షన్లో ఫ్యామిలీ పదం అనే మూవీలో హీరోగా కనిపించనున్నాడు.