మాస్ మహారాజు రవితేజ హీరోగా.. హరిష్ శంకర్ డైరెక్షన్లో తరికెక్కిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయున ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రవితేజకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి సినిమా వెనక్కు రాబట్ట లేకపోయింది. ఈ క్రమంలో సినిమా ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. అయన వివరిస్తూ మిస్టర్ బచ్చన్ సినిమా కచ్చితంగా అంత పెద్ద ఫ్లాప్ అయ్యి ఉండేది కాదని.. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చింది. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పిందని వివరించాడు. కానీ.. హరీష్ శంకర్ కాస్త నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడి ఉంటే ఈ రోజు సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ గా నిలిచేది కాదని వెల్లడించాడు.
ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ లో కొంతమంది విలేకరులపై ఆయన మాట్లాడిన తీరు సినిమాకు మరింత దెబ్బ అయిపోయిందని.. మా సినిమా పై నెగిటివ్ రివ్యూస్ దండయాత్ర మొదలైందని.. ఆయన మాటల కారణంగా అందరూ మా మిస్టర్ బచ్చన్ సినిమాపై కసి చూపించి దారుణంగా రేటింగ్ ఇచ్చారని.. వారు ఇచ్చిన రేటింగ్స్ వల్లే మా సినిమా వసూళ్ళు తీవ్రంగా దిగజారిపోయాయని.. సినిమాలో కంటెంట్ ఉండి ఉంటే.. తాము ఆ రేటింగ్స్ పై పోరాడే వాళ్ళం కాదని.. కానీ మాకు అవకాశం లేకుండా పోయిందంటూ టీజీ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్లాప్ అనేది హరీష్ శంకర్‌కే కాదు.. చాలామంది డైరెక్టర్లకి కామన్. కానీ.. విపరీతమైన యాటిట్యూడ్ తో ముందుకు పోతే హరీష్ శంకర్ కి నష్టం తప్ప.. లాభం ఉండదు. అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్స్ కూడా హరీష్ శంకర్ లాగా మాట్లాడారు అనేది నిజం.
ఒక ప్రముఖ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు సినిమాపై హైప్‌ని తీసుకువస్తుంది అనుకున్నాడు. కానీ అది మిస్ ఫైర్ అవ్వడంతో సినిమా ప్రీమియర్స్ లో వచ్చిన టాక్ కారణంగా ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడిపోయింది. దీంతో మొదటి రోజే వసూలు రూ.8 కోట్లకు పైగా రాబట్టేంత సత్తా ఉన్న కేవలం నాలుగు కోట్లతో సరిపెట్టింది. సినిమాకి వస్తున్న రివ్యూ రేటింగ్స్ చూసి కూడా హరీష్ శంకర్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో మరుసటి రోజు అభిమానతో లైవ్ ఇంట్రక్షన్ పెట్టాడని.. నేను తీసిన సినిమా అంత గొప్పది కాదు.. అంత చెత్త సినిమా కూడా కాదు.. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది వాస్తవమే అయినా.. ఇప్పుడు వసూలు బాగున్నాయి.. టాక్ కూడా పెరిగింది అందుకే మీ ముందు ఇలా కూర్చున్న గలిగా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ మాటలు ఇంకా మిస్ ఫైర్ అయ్యాయి. హరీష్ శంకర్ చెప్పేవి అబద్ధాలు అని అందరు కూడా కనిపెట్టేశారు. హరీష్ శంకర్ కి ఉన్న ఈ అతి.. అతని పతనానికి కారణమవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.