టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఏఎన్ఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసిన బాలయ్య.. యంగ్ డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ.. సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికీ వయసుతో సంబంధం లేకుండా మన్మధుడిలా మెరిసిపోతున్న నాగ్.. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు.. కథల కోసం ఆరాటపడుతుంటారు. కథ ఏమాత్రం నచ్చినా ప్రాజెక్ట్ కు వెంటనే సైన్ చేస్తాడు. ఈ క్రమంలో ఎప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో నాగ్ మెరవనున్నాడని సమాచారం. హీరోగా, నిర్మాతగా ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసిన ఈయన.. రియాలిటీ షో హోస్ట్ గానూ మెరిశాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కుబేర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో నాగార్జునతో పాటు ధనుష్ కూడా నటించనున్నారు. నాగార్జున ఈ సినిమాతో పాటు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇప్పుడు వార్తలు అవుతున్నాయి. ఆ హీరె మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కూలి సినిమాలో నాగ్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాగా.. నాగార్జున సినిమాలో నటిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియన్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ లో నటించనున్నాడని టాక్.
రజినీకాంత్ కు దీటుగా మరింత పవర్ఫుల్గా ఈ పాత్రను డిజైన్ చేశారట. లోకేష్ ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. ఆయన ఎదుర్కొనే పోలీస్‌గా నాగ్ నటించబోతున్నాడట. అయితే చాలా కర్కసమైన పాత్రలో.. వైలెంట్‌గా.. ఎదుటివారికి దడ పుట్టించే విధంగా నాగార్జున క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఒక విలన్ కంటే మించిన కృయల్టితో నాగ్ పాత్ర డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో నాగార్జున నటిస్తున్న ఈ సినిమా.. తన కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయనంగా మారింది. సినిమా క్లిక్ అయితే మాత్రం నాగార్జునకు ఇలాంటి రోల్స్ మరిన్ని రానున్నాయి అనడంలో సందేహం లేదు.