టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ యాక్టర్ కూతురిని కోలివుడ్ హీరో శింబు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని.. దీనిపై అధికారిక ప్రకటన రానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన.. సిలంబ రసం అలియాస్ సింధు 2002లో కాదల్ విష్ణు తెల్లై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి శింబు ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నాడు. కెరీర్ మొదట్లో అనేక వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్న శింబు నెగటివ్ రివ్యూస్ ని తెచ్చుకున్నాడు. అయితే కసితో మరింతగా శ్రమించి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల చేసిన కొన్ని సినిమాలకి మంచి రెస్పాన్స్ రివడంతో మరింత ఫామ్లో దూసుకుపోతున్నాడు.
కాగా శింబు దేశాంగి పెరియాసామి డైరెక్షన్లో తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. కమల్ హాసన్.. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు శింబు. తన పర్సనల్ విషయంలో మాత్రం ఇప్పటికే ఎన్నో ఎఫైర్లు వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో శింబు నయనతారతో ప్రేమలో ఉన్నాడని.. తర్వాత వారిద్దరు బ్రేకప్ చేసుకోవడం, సౌత్ బ్యూటీ హన్సిక, శింబు ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇది కూడా బ్రేకప్ అయిపోయింది. ఇటీవల నటి నిధి అగర్వాల్, శింబు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే అది కేవలం రూమర్ అని క్లారిటీ వచ్చేసింది. నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఆమె ఎంగేజ్మెంట్ తో ఇది కూడా అబద్ధమని తెలిసిపోయింది. అయితే సోషల్ మీడియాలో శింబు పెళ్ళి వార్తలు హల్సల్ చేయడంతో విసిగిపోయిన శింబు తండ్రి.. రాజేందర్, శింబుకి త్వరలోనే పెళ్లి చేస్తానంటూ వివరించాడు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ కూతురుని శింబు వివాహం చేసుకోబోతున్నాడని.. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో శింబు వివాహం చేసుకోబోయే ఆ టాలీవుడ్ స్టార్ యాక్టర్ కూతురు ఎవరు అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.