సాధారణంగా ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో కోసం హీరోయిన్ కోసం ఏమైనా చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది పచ్చబొట్టు కూడా పొడిపించుకుంటూ ఉంటారు. అయితే ఆ పచ్చబొట్టును వాళ్ళ పొడిపించుకునే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ .. తమ పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ పై టాటూ వేయించుకోకూడదు. అది అందరికీ తెలుసు. కానీ మితిమీరిన అభిమానంతో కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కాగా అలాంటి ఒక విషయాన్ని బయట పెట్టి షాకింగ్ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకుంది కాజల్ అగర్వాల్.
రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. “నేను ఒక సినిమా షూట్ చేస్తున్న టైంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా కార్ వ్యాన్ లోకి వచ్చి సడన్గా డోర్ క్లోజ్ చేసి.. షర్ట్ తీసేశాడు .. ఆ టైంలో చాలా చాలా భయపడ్డాను .. ఏంటి ఏం చేస్తున్నావ్ ..? అంటూ అడిగాను”..
” వెంటనే మేడం మీరంటే నాకు చాలా ఇష్టం .. మీ పేరుని నేను టాటూ వేయించుకున్నాను ..చూడండి అంటూ తన ఛాతిపై ఉన్న టాటూ చూపించారట. అయితే కాజల్ మాత్రం చెడా మెడా తిట్టేసిందట . ఇది తప్పు ఇలా చేయకూడదు .. ఇంకోసారి ఇలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఇంకొకసారి ఎవరు కూడా ఇలా చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది”.. కాజల్ అగర్వాల్ . అఫ్ కోర్స్ అభిమానం కొన్ని విధాలుగా చూపించడం మంచిది. కానీ ఈ విధంగా భయపెట్టేలా చేయడం తప్పు అంటున్నారు జనాలు..!!