సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సీన్స్ అయినా నటించడానికి హీరో హీరోయిన్లు ఇష్టపడుతూ ఉంటారు . కొంతమంది హీరోలు బోల్డ్ గా నటించడానికి ఏమాత్రం సిగ్గు, మొహమాట పడరు .. హీరోయిన్స్ కూడా అంతే మరి.. కొంతమంది మాత్రం అలాంటి సీన్స్ లో మేము నటించము అంటూ తగ్గేసి చెప్పేస్తూ ఉంటారు . అయితే రీసెంట్గా హీరోయిన్ తమన్నా మాత్రం తనపై అభిమానులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని తుంచి పడేసింది . జీ కర్దా వెబ్ సిరీస్ లో ఆమె ఎంత హాట్ గా నటించి కనిపించిందో మనందరికీ తెలిసిన విషయమే .
కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తమన్నా. ఆమె మాట్లాడుతూ..”చాలామంది అనుకుంటూ ఉంటారు రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు అమ్మాయిలు చాలా చాలా ఇబ్బంది పడతారు ..కష్టపడతారు అని.. మొదట్లో నేను కూడా అలానే అనుకునేదాన్ని.. కానీ నా రూల్స్ నేనెప్పుడు బ్రేక్ చేశానో అప్పుడే నాకు అర్థమైంది .. చాలామంది అబ్బాయిలు శృంగార సన్నివేశాలలో నటించడానికి హీరోయిన్స్ కంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు”..
” దానికి కారణం ఎక్కడ అమ్మాయిలు తమను తప్పుగా అర్థం చేసుకుంటారో అన్న భయం. అయితే అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే అలాంటి మూమెంట్స్ లో నటించేటప్పుడు ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలి.. అప్పుడు ఎలాంటి ఇబ్బంది రావు అంటూ చాలా చాలా బోల్డ్ గా మాట్లాడింది”. ప్రెసెంట్ తమన్నా చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ముందుకెళ్తుంది . అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . అయితే మేము డైటింగ్ చేస్తున్నాము అని పెళ్లి గురించి మాత్రం అడగద్దు అంటూ తేల్చి చెప్పేస్తుంది తమన్నా..!!