పరగడుపున అరటిపండు తినడం వల్ల లాభమా? నష్టమా?

సాధారణంగా అరటి పండు లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు దాగి ఉంటాయి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అరటిపండు లో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రోజు అరటిపండు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కూడా.

అదేవిధంగా కొందరికి అరటి పండును పడగడుపున తింటే మంచిదా కాదా అనే సందేహాలు ఉంటాయి. నిజానికి అరటిపండు నార్మల్గా తినడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది పడగడుపున అరటిపండు తింటారు. ఖాళీ కడుపుతో అరటిపండు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

అరటి పండులోని ఆమ్లతత్వం జీర్ణ క్రియపై ప్రభావం చూపిస్తదట. అందువల్ల అరటి పండును పడగడుపున అస్సలు తినకూడదు. ఇక అరటిపండును పడగడుపున తినడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు కూడా దరి చేరుతాయి. అందువల్ల పడగడుపున అస్సలు అరటిపండుని తినవద్దు.