కళ్యాణ్ రామ్ .. పేరుకి నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే అయినా ఏనాడు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావడానికి తన తండ్రి పేరుని తన తాత పేరుని ఎప్పుడు ఉపయోగించుకోలేదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆయన చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వస్తున్న సరే .. తన నటనపై ఉన్న నమ్మకంతో ఫైనల్లీ సక్సెస్ కొడతాను అన్న ధీమాతో బాగా కష్టపడ్డాడు . అనుకున్నట్లే సక్సెస్ సాధించాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ టాప్ పొజిషన్లో ఉన్న ఇంకా హీరోగా ఎదగడానికి కల్యాణ్ రామ్ కష్టపడుతున్నాడు అంటే దానికి కారణం ఆయన చూస్ చేసుకున్న కథలు .
ఆయన బాడీ లాంగ్వేజ్ కు సూట్ కాకపోవడమే. కాగా బింబిసారా తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత అమిగోస్ తో ఫ్లాప్ అందుకున్నాడు . ఇప్పుడు డెవిల్ సినిమా పైనే తన ఆశలు అన్ని పెట్టుకొని ఉన్నాడు . డిసెంబర్ 29న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు కళ్యాణ్ రామ్. రీసెంట్గా కళ్యాణ్ రామ్ సుమ అడ్డ షో కి గెస్ట్ గా హాజరయ్యారు .
సుమతో పాటు ఆడి పాడి అలరించి చిందులు వేశాడు. అంతేకాదు సుమకు ధీటైన రేంజ్ లో పంచులు కూడా వేస్తూ బాగా నవ్వించాడు . ఈ మూమెంట్ లోనే తన కెరియర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రివీల్ చేశాడు . “తొలిచూపులోనే , అభిమన్యు సినిమాలు వెంట వెంటనే ఫ్లాప్ అవ్వడంతో తనను చాలా చిన్నచూపు చూశారని .. నెగిటివ్గా కామెంట్ చేశారని.. నా ముఖానికి అసలు హీరో అయ్యే సీనే లేదు అంటూ అవహేళనగా మాట్లాడారు అని ..ఎమోషనల్ అయ్యాడు”.
” అంతేకాదు ఆ టైంలో తన తండ్రిగారు ఇచ్చిన సపోర్ట్ తనకు ఎంతో హెల్ప్ చేసింది అని.. నీ ఇష్టం నువ్వు ఏమి కావాలి అనుకుంటున్నావో అదే చెయ్ ..పక్క వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చాడు అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు”. కళ్యాణ్ రామ్ జనరల్ గా ఏ ఈవెంట్ లోని ఇంత ఓపెన్ గా మాట్లాడడు. ఫస్ట్ టైం తండ్రితో ఉన్న బాండింగ్ గురించి కూడా బయట పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది..!!