అంత చిన్న ఏజ్‌లోనే ‘ తాప్సి ‘ అలాంటి ప‌నులు చేసిందా.. అమ్మ‌డు మ‌హా ముదురే..!!

స్టార్ హీరోయిన్ తాప్సి పన్నుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో మంచు మనోజ్ జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. న‌ట‌న‌తో కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో నటించి మెప్పించిన తాప్సి.. తరువాత బాలీవుడ్ అవకాశాలు దక్కడంతో మకాం అక్కడకు మార్చేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ డైరెక్టర్స్ ఈమెను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్‌ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత కాంచన 3, గేమ్ ఓవర్ లాంటి సినిమాల్లో కూడా నటించింది.

ఇక సౌత్ లో హీరోయిన్గా నటిస్తూనే బాలీవుడ్ లో అవకాశాలు కొట్టేసిన ఈమె అక్కడ మొదట బేబీ సినిమాతో మంచి సక్సెస్ సాధించింది. తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తు దూసకపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల అమితాబచ్చన్ తో పింక్ మూవీలో నటించి సంచలనం సృష్టించింది. తాజాగా షారుఖ్ ఖాన్ సరసన డంకి మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తాజాగా రిలీజై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న తాప్సి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

Taapsee made such a revelation on wrestling with Shahrukh in 'Dinky', you  will be surprised - Trend Trackers - Stay Updated with Latest News and  Insights

తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా సీనియర్‌ను లవ్ చేసానని.. తను 10వ‌ తరగతి చదువుతున్నాడని చెప్పుకొచ్చింది. మొదట్లో తను కూడా నాపై ఇంట్రెస్ట్ చూపించాడని.. అయితే ఆ తర్వాత చదువు పాడైపోతుందని నాకు దూరమయ్యాడంటూ చెప్పుకొచ్చింది. చదువుపై శ్రద్ధ పెట్టాలని తను నాకు ఫ్రీ సజెష‌న్‌ ఇచ్చాడని వివరించింది. ఇలా తన ఫస్ట్ లబ్‌ బ్రేకప్ అయిన తర్వాత అందులోంచి బయటకు రావడానికి తాప్సికి చాలా సమయం పట్టిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో .. అంత చిన్న ఏజ్ లోనే తాప్సి లవ్ ఎఫైర్‌లు నడిపిందా.. ఈ అమ్మ‌డు మహాముదురే అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.