ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఈగిల్ మూవీ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన క్రమంలో రవితేజ మరో మూవీ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో యానిమల్ బోల్డ్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుందంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా అసలు ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే అంశాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన క్లాస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా కనిపించబోతుంది.
ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వివరిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. తాజాగా ఈ మూవీ టీం సినిమాకు సంబంధించిన భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. మా మాస్ మహారాజ్ సరసన.. క్లాస్ మహారాణి అంటూ ఈ పోస్టర్ను ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఈ బ్యూటీ అదిరిపోయే గ్లామరస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.