రజిని – లోకేష్ మూవీ లో ఆ పాత్రను రిజెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్… ఎందుకో తెలుసా…!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన నటనకి ఒక్క కోలీవుడ్ లోనే అభిమానులు లేరు.. దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక రజనీకాంత్ హీరోగా త్వరలో తలైవా 171 మూవీ మొదలు కానుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తుంది.

ఇక ఈ మూవీకి యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అసుల మేటర్ ఏమిటంటే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తలైబర్ 171 లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఓ కీలక రోల్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం డన్కి మూవీ చేస్తున్న షారుఖ్ మరోవైపు తన కుమార్తె సుహానా తొలి సినిమాలో స్పెషల్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై స్పెషల్ రోల్స్ చేయాలని ఆలోచన ఈయనకు లేదట. ఇక అతి త్వరలోనే లోకేష్ దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేసే ఆలోచనలు ఉన్నాడట షారుఖ్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.