మాస్ మహారాజ్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ గా ఆ క్లాస్ బ్యూటీ.. అసలు ఊహించి ఉండరు..

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఈగిల్ మూవీ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన క్రమంలో రవితేజ మరో మూవీ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Harish Shankar Confirms Period Drama Movie With Ravi Teja, This Is Going To  Be His Next After Pawan Kalyan's Ustaad Bhagath Singh | Ravi Teja Harish  Shankar Movie : రవితేజతో పీరియాడిక్ డ్రామా

ఈ వార్తలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో యానిమల్ బోల్డ్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా అసలు ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే అంశాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన క్లాస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా కనిపించబోతుంది.

Bhagyashri Borse On Board For Ravi Teja - Harish Shankar Project |  cinejosh.com

ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వివరిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. తాజాగా ఈ మూవీ టీం సినిమాకు సంబంధించిన భాగ్యశ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. మా మాస్ మహారాజ్ సరసన.. క్లాస్ మహారాణి అంటూ ఈ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఈ బ్యూటీ అదిరిపోయే గ్లామరస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.