కెరీర్ లో ఒకే ఒక హిట్… కానీ బాలయ్య రూ.300 కోట్ల సినిమాలో ఛాన్స్… ఎక్కడో మత్చేసుకుని పుట్టావు గా…!

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య వయసులో చాలా పెద్ద అంతరాయం ఉంటుంది. తమకంటే వయసులో 20 నుంచి 30 ఏళ్లు పెద్దవారి పక్కన హీరోయిన్గా నటించే అవకాశాలు కొంతమంది హీరోయిన్లకి సైతం వస్తాయి. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలు సైతం కుర్ర హీరోయిన్లని ఎంపిక చేసుకుంటారు.

దీంతో చాలామంది కుర్ర హీరోయిన్లు చిన్నవయసులోనే ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి సీనియర్ హీరోల సరసన హీరోయిన్స్ గా చేస్తుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే తన అంద చందాలతో సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు షేక్ చేసే ఓ హీరోయిన్ సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఆమె మరి ఎవరో కాదు ఊర్వశి రౌతేలా. తాజాగా ఈ ముద్దుగుమ్మ నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది.

2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊర్వసి ఒకే ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి మూవీ నుంచి ఇప్పటివరకు అన్ని ఫ్లాప్ సినిమాలే కానీ.. సీనియర్ హీరో పక్కన నటించే సత్తా ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈమె అదృష్టాన్ని చూసిన ప్రేక్షకులు…” ఎక్కడో మత్చేసుకుని పుట్టావుగా “.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.