టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల.. త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కించగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ప్రస్తుతం చిత్రటీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నారు. ఇదే తరుణంలో శ్రీలీలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల బంధువులట. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి సొంతూరు కూడా అదే. అంతేకాదు, అనిల్ రావిపూడికి స్వర్ణలత కజిన్ సిస్టర్ అవుతుందట. దీంతో అనిల్ రావిపూడి, శ్రీలీల మామకోడళ్లు అవుతారు. ఈ బంధంతోనే అనిల్ ను మామ అని పిలుస్తుందట శ్రీలీల. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో అనిల్ ఈ విషయాన్ని బయటపెట్టారు. మొత్తానికి రియల్ లైఫ్ లో బంధువులైన వీరిద్దరూ.. రీల్ లైఫ్ లో కలిసి వర్క్ చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి.