ఆ విషయంలో నిహారిక చేసిన తప్పే సితార కూడా.. మహేష్ జాగ్రత్త పడతాడు..?

సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీస్ వారి వారసులుగా తమ పిల్లల్ని కూడా పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత వారి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్స్ గా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయారు. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుళ్లు అలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ హీరోయిన్స్ గా వచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

అదేవిధంగా మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చి స‌క్స‌స్ అయ్యారు. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు ఉన్న వారిద్దరూ ఇండస్ట్రీలకి రాలేదు. కానీ నాగబాబు కుమార్తె నిహారిక ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వెబ్ సిరీస్ లో నటిస్తూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్గా ఆమెకు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో పెళ్లి పీటలెక్కింది. దీంతో ఇండస్ట్రీకి దూరమైన నిహారిక చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. తరచూ ఈ విషయంపై తన భర్తతో గొడవ పడేదని ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఆసక్తి కారణంగానే ఆమె విడాకుల కోరుకుందని న్యూస్ వైరల్ అయింది.

ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలని ప్రయత్నించిన నిహారిక సక్సెస్ కాలేకపోయింది ఆ ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడి వ్యక్తిగతంగా కూడా ఆమె ప్రస్తుతం సంతోషంగా ఉండ‌లేక‌పోతుంట‌. ఈ నేపథ్యంలో నిహారిక మాదిరిగానే మహేష్ కూతురు సితార కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పాన్ ఇండియా లెవెల్ బ్రాండ్ ప్రొడ‌క్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడే కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార సినిమాలపై ప్రేమ పెంచుకుంది.

ఎలాగైనా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటుంది. అలాగే సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటే అంతా బానే ఉంటుంది. కానీ హీరోయిన్గా అమ్మ సక్సెస్ అందుకోకపోతే నిహారిక లాగే తన కెరీర్ ఇబ్బందులు పడుతుందని భావిస్తున్నారు నెట్టిజన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ నమ్రత – మహేష్ లు సితార కెరియర్ పై పక్క ప్లానింగ్ తో ఉన్నారని ఆ విషయంపై మీరేమీ ఇబ్బంది పడొద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.