టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందానికి అందం ..నటనకి నటన ..అభినయానికి అభినయం ..అనుకోవకు అనుకువ.. అన్ని కలగలిసిన ఓ స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిన కీర్తి సురేష్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి .
మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ట్రెండ్ అవుతుంది . ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్ గా జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అనిరుద్ పార్టీ ఇచ్చాడని.. ఆ పార్టీలో వీళ్ల ప్రవర్తన అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించిందని ..
అప్పట్నుంచి మరోసారి నెట్టింట వీళ్ల పెళ్లి న్యూస్ వైరల్ గా మారింది అంటూ తెలుస్తుంది. అయితే రీసెంట్గా కీర్తి సురేష్ వాళ్ళ నాన్నగారు దీనిపై రియాక్ట్ అయ్యారు..” మా పాపకు -అనిరుధ్ కి పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ..వాళ్లు ఫ్రెండ్స్ మాత్రమే”..అంటూ ఆ వార్తలను కొట్టి పడేసారు..!!