సినిమా ఇండస్ట్రీలో జనరల్ గా ఓ హీరో కోసం హీరోయిన్ కోసం రాసుకున్న కథను మరో హీరో హీరోయిన్ చేస్తూ ఉంటారు . ఇప్పటికే అలాంటి సినిమాలు మనం ఎన్నో చూసాం. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ సైతం ఇష్టపడి నటించాలి అనుకున్న సినిమాను యంగ్ హీరోయిన్ ఆస్థానాన్ని ఆక్యూపై చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళీ కుట్టి నివేదా థామస్.
తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని పాపులారిటీ దక్కించుకున్న నివేదా థామస్ .. కాజల్ అగర్వాల్ ఆఫర్ ని ఎగరేసుకుపోయింది . అంతేకాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా తన ఖాతాలో వేసుకుంది . ఆ సినిమా మరేదో కాదు న్యాచురల్ స్టార్ నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ది హిట్ సినిమాగా నిలిచిన “నిన్ను కోరి”. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్ – ఆది పినిశెట్టి -నాని నటించారు .
కాగా ఈ సినిమాలో నివేదా థామస్ పాత్ర కోసం ముందుగా కాజల్ అగర్వాల్ ను అనుకున్నారట మేకర్స్ . అయితే నాని కూడా కాజల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఉంచడానికి బాగా ట్రై చేశారట. కానీ అప్పటికే వేరే సినిమా కోసం కాల్ షీట్స్ ఇవ్వడం తో కాజల్ ఈ సినిమాకి టైం అడ్జస్ట్ చేయలేకపోయింది . అలా కాజల్ ఎంతో ఇష్టపడిన సినిమాలో నివేద థామస్ నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇది తెలిసి కూడా కాజల్ సైలెంట్ అయిపోయింది. సినిమా బాగుంది అని చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్ అంటే కాజల్ లా ఉండాలి అంటూ పొగిడేసారు జనాలు..!!