నందమూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్ దంపతుల కుమారుడు హర్ష వివాహం ఆగస్టు 20వ తేదీన వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో సాయి గీతికతో హర్ష ఏడు అడుగులు వేశారు. నందమూరి కుటుంబసభ్యులందరూ ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. అలాగే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రములు సుహాసిని కుమారుడి పెళ్లికి హాజరు అయ్యారు.
సొంత మేనల్లుడు కావడంతో.. నందమూరి కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ హర్ష పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాయల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే మేనల్లుడి పెళ్లిలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పటేక్ ఫిలిప్ కంపెనీకి చెందిన బ్రాండెడ్ వాచ్ ను ఎన్టీఆర్ ధరించారు. ఈ వాచ్ ధరెంతో తెలిస్తే చుక్కలు కనపడతాయి. ఎందుకంటే, దాని ఖరీదు అక్షరాల రూ.2.45 కోట్లు ఉంటుందట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ వాచ్ ల ప్రేమికుడు. ఆయన దగ్గర ఇలాంటి ఖరీదైన వాచ్ లు మరెన్నో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ `దేవర` అనే సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న దేవర వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది.