చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆ సీనియర్ స్టార్ హీరోలతో కీరవాణి.. ఏ సినిమాల్లో అంటే..?

కీరవాణి.. ఇప్పుడంటే రాజమౌళి సినిమాలకు అధిక ప్రాధాన్యం, మిగిలిన సన్నిహితుల సినిమాల తదుపరి ప్రధానం ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు కీరవాణి సినిమాలు దాదాపు స్టార్ హీరోలతోనే ఉండేవి. అయితే రాజమౌళి పాన్ ఇండియా సినిమాలతో ట్రెండింగ్‌లోకి వచ్చాక ఎక్కువగా ఆయన సినిమాలకే పని చేస్తున్నాడు. అలాంటి కీరవాణి ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకేసారి చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరోల సినిమాలు.. ఘోస్ట్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నాగార్జున హీరోగా 99 వ సినిమా స్టార్ట్ చేస్తారని టాక్.

ఈ సినిమా దర్శకుడు విషయంలో ఏవేవో డౌట్స్ ఉన్నాయి. అవన్నీ 29న క్లియర్ అవుతాయి అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడగా కీరవాణి చేస్తారు అని సమాచారం. ఒకవేళ ఇది జరిగితే ఇద్దరూ మళ్లీ ఏడేళ్ల గ్యాప్‌తో కలిసి పని చేయ‌బోతున్నారు. ఆఖరిగా నాగార్జున, కీరవాణి “ఓం నమో వెంకటేశాయ” సినిమా చేశారు. ఇక మరో స్టార్ హీరో చిరంజీవి. చిరు సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తాడట. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జరిగితే 28 ఏళ్ల తర్వాత కలిసి పని చేయడం అన్నమాట. గతంలో ఆఖరిగా ఇద్దరు ఎస్పీ పరశురాం, సినిమాకు పని చేశారు. పూర్తిగా సోషియో ఫాంటసీలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. వినాయక చవితికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.