విజ‌య్ దేవ‌ర‌కొండతో ల‌వ్ క‌న్ఫార్మ్ చేసేసిన ర‌ష్మిక‌.. ఇంత‌కంటే ప్రూఫ్ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ల‌వ్ లో ఉన్నార‌ని చాలా రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ వారు మాత్రం అదేమి లేదంటూ త‌ప్పించుకుంటున్నారు. అయితే త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం.. క‌లిసి వెకేష‌న్స్ కు వెళ్ల‌డం.. డిన్న‌ర్ డేట్స్ అంటూ మీట్ అవ్వ‌డం.. వంటి అంశాలు విజ‌య్‌, ర‌ష్మిక ప్రేమ‌లో ఉన్నార‌న్న వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తూ వ‌స్తున్నాయి.

తాజాగా ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండతో ల‌వ్ ను ఆల్మోస్ట్ క‌న్షార్మ్ చేసేసింది. ఈ అందాల సోయ‌గం ఎయిర్ పోర్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే ఈ సంద‌ర్భంగా ఆమె ధ‌రించిన ష‌ర్ట్ అంద‌రినీ ఆక‌ర్షించింది. ఎందుకంటే, అదే ష‌ర్ట్ ను కొద్ది రోజుల క్రితం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను వేసుకున్నాడు. ఇప్పుడు ర‌ష్మిక వేసుకుని క‌నిపించింది.

విజ‌య్ బాడీకి ఆ ష‌ర్ట్ చ‌క్క‌గా స‌రిపోగా.. ర‌ష్మికగా లూజ్ గా క‌నిపిస్తోంది. దీంతో ఒకే ష‌ర్ట్ లో ఉన్న ఇద్ద‌రి ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్లు ర‌ష్మిక వేసుకున్న‌ది విజ‌య్ చొక్కానే అని.. వీరిద్ద‌రూ ల‌వ్ లో ఉన్నార‌న‌డానికి ఇంత‌కంటే ప్రూఫ్ ఇంకేం కావాల‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి విజ‌య్, ర‌ష్మిక తమ ల‌వ్ ను ఎప్పుడు క‌న్ఫార్మ్ చేస్తారో చూడాలి. కాగా, ర‌ష్మిక ప్ర‌స్తుతం పుష్ప 2, యానిమల్‌, రెయిన్ బో మ‌రియు నితిన్ తో ఓ సినిమా చేస్తోంది. మ‌రోవైపు విజ‌య్ రీసెంట్ గానే ఖుషిని కంప్లీట్ చేసి.. గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా, ప‌రుశురామ్ తో ఓ సినిమా ప‌ట్టాలెక్కించాడు.