సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది.
అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. ప్రేక్షకులకు కొన్ని సినిమాల విషయంలో మాత్రమే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. కొన్ని సినిమాల విషయంలో ఇలాంటివి జరిగాయన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ప్రేక్షకులను అలరించి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఓ సినిమా విషయంలో మాత్రం అచ్చంగా ఇలాగే జరిగిందట.
ఆ సినిమా ఏదో కాదు ఒకప్పటి స్టార్ హీరోలైన అర్జున్, జగపతిబాబు మల్టీ స్టారర్ గా నటించిన హనుమాన్ జంక్షన్ సినిమా. అయితే ఒకప్పటి స్టార్ హీరోలు హనుమాన్ జంక్షన్ సినిమా ను వదిలేసుకున్నారట. హనుమాన్ జంక్షన్ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ రాజా హనుమాన్ జంక్షన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
ముందుగా ఈ సినిమాలో అర్జున్, జగపతిబాబులను హీరోలుగా ఈ సినిమాకి ఎంపిక చేయలేదట. మోహన్ బాబు – రాజశేఖర్‌లతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే వాళ్ళిద్దరూ అడ్వాన్సులు కూడా తీసుకున్నారట. ఆ తర్వాత ఎడిటర్ మోహన్ జగపతిబాబును, అర్జున్ ను సజెస్ట్ చేశారని మోహన్ రాజా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ మల్టీస్టారర్ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.