ర‌వితేజ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌`రావ‌ణాసుర‌`!

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వ‌చ్చిన చిత్రం `రావ‌ణాసుర‌`. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, జయరాం, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు.

రావు రమేష్, శ్రీరాం, దక్ష నగర్కర్, మురళి శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏప్రిల్ 7న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ద‌క్కినా.. బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ర‌వితేజ ఇందులో గ్రే షేడ్ ఉన్న పాత్రలో అద్భుతంగా మెప్పించాడు.

అయితే అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకున్న ఈ చిత్రం నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే 5నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇదొక ర‌కంగా ర‌వితేజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.