డబ్బింగ్ చెప్పేటప్పుడు కీర్తి సురేష్ అందాన్ని చూసారా? మహానటి మహిమ అది!

కీర్తి సురేష్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 2018లో రిలీజైన ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ వాస్తవ మహానటిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెని వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరాని మర్చిపోవడం అంత సులువు కాదు. నాని సినిమా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

దసరా సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని ఇద్దరు మొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించడంతోపాటు నటనను ఇరగదీశారు. ఈ సినిమాలో ఇద్దరిని నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది. కాగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీగా కలెక్షన్స్ రాబట్టి నాని కెరియర్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా కూడా నిలిచి, వంద కోట్ల మార్క్ ని దాటేసింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలో కీర్తి సురేష్ తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కీర్తి తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించడం విశేషం. కానీ ఆ సీన్ ని సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి సురేష్ వెల్లడించింది. కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.