టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ను తెచ్చుకుంది హీరోయిన్ తాప్సి. 2010లో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.. తన మొదటి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావడంతో ఇమె కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుందని భావించారు. అన్నట్లుగానే మంచి ఆఫర్లతో కొద్దికాలం నేట్టుకొచ్చింది. కానీ ఆమె కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. అగ్ర హీరోలతో చేసినప్పటికీ ఆ సినిమాలు ఈమెకి ప్లస్ కాలేకపోయాయి.
ఇక తాప్సి ఇక్కడ విజయాలు రాకపోవటంతో బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 2016 నుండి హిందీ సినిమాల్లో బిజీ అయ్యింది తాప్సి. హిందీ సినిమాల్లో అడుగుపెట్టి ఆమె 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. తాజాగా ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ బాలీవుడ్లో మంచి కథలను ఎంచుకోవడం వల్ల ఇక్కడ నాకు మంచి ఫలితాలు వచ్చాయని అలాగే నేను ఇన్నాళ్లపాటు అక్కడే మంచి మంచి సినిమాలు చేస్తూ కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చింది తాప్సి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించినప్పటికీ అక్కడ స్టార్డం దక్కింది. అయితే నటిగా తనకు ఎప్పుడూ సంతృప్తి దక్కలేదు అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. నటిగా సౌత్ లో నటించడం వల్ల సంతృప్తి దక్కలేదు అనడం తో సౌత్ ఇండస్ట్రీని అవమానించినట్లే అంటూ సోషల్ మీడియాలో ఈమె పైన విమర్శలు చేస్తున్నారు నేటిజన్స్.
బాలీవుడ్లో మంచి కథలను ఎంపిక చేసుకున్నట్లే సౌత్ లో కూడా మంచి కథలను ఎంపిక చేసుకొని ఉంటే ఇప్పటివరకు కూడా మీరు టాలీవుడ్ లోనే కొనసాగిస్తూ ఉండేవారనీ తెలియజేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో నటించటం వల్లే బాలీవుడ్లో మంచి ఆఫర్లు వచ్చాయని మరికొందరు అంటున్నారు.