నాగ చైతన్య, హీరోయిన్ శోభిత మధ్య ఏం జరుగుతోంది?

అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. దానికి కారణం ఆమె లుక్స్. అవును, బాలీవుడ్ నుండి దిగుబడి చేసిన నార్త్ బ్యూటీ మాదిరి ఉంటుంది ఈ అమ్మడు. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు సంపాదించింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు ఇటీవల దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోన్న సంగతి విదితమే. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్. కాగా ఈ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.

ఆమధ్య శోభిత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టడంతో మొదలైంది ఈ తంతు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కధ షురూ అయింది. ఓ రెండు వర్గాల మధ్య ఈ పోరు జరుగుతోంది. వారి గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు. మా నాగ చైతన్య అమాయకుడంటూ ఓ వర్గం సపోర్ట్ చేస్తే… మీ హీరో మొత్తని దొంగ అంటూ కొంతమంది ఏకి పారేస్తున్నారు. అయితే నెట్టింట ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా చైతన్యలు తనకేమి పట్టనట్లు తమ సినిమాలు తాము చేసుకుంటూ బాగా బిజీ అయిపోయారు.

పోనీ శోభిత కూడా చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. పైగా ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో కూడిన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు వేడి పుట్టిస్తోంది. దీనితో శోభిత, నాగ చైతన్య వ్యవహారం చాలా దూరం వెళుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల వేడుక కోసం శోభిత స్టన్నింగ్ గ్లామర్ లుక్ లో వెలిగిపోతోంది. మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో నాగ చైతన్య, శోభితఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా అప్పట్లో తన కథనంలో పేర్కొంది.