హీరోయిన్లతో రొమాన్స్‌ చేసే సీన్ హీరోలకు లేదు: తమన్నా

అందాల తార తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాధారణంగా తమన్నా తనపని తాను చేసుకుంటూ పోతుందే తప్ప, వివాదాస్పద కామెంట్లకు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అలాంటిది తమన్నా తాజాగా మన తెలుగు హీరోల విషయంలో కాస్త శృతిమించి మాట్లాడిందనే చెప్పుకోవాలి. ఎవరేం అనుకుంటారో అనే విషయం ఆలోచించకుండా సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవును, తాజాగా తమన్నా చేసిన కామెంట్లు కూడా అందరికీ షాకింగ్‌ గా అనిపిస్తున్నాయి.

ఒకప్పుడు తెలుగు తెరపైన ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌ చేసిన తమ్మూ ఇప్పుడు మాత్రం కథానాయక ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఇప్పుడు ఆమె బెస్ట్ ఆప్షన్‌ గా మారింది అనడంలో సందేహమే లేదు. అయితే అమ్మడి కన్ను ప్రస్తుతం బాలీవుడ్‌ మీద పడింది. ఈ క్రమంలోనే ఆమె హీరోలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో రచ్చకు తెర లేపాయి. విషయం ఏమంటే, ఓ మీడియా వేదికగా రొమాంటిక్‌ సీన్స్ విషయమై సదరు విలేఖరి ప్రశ్నించాడు. దానికి బదులుగా తమ్మూ కింది విధంగా స్పందించింది.

శృంగారం విషయంలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువగా తడబడతారని, కొందరైతే బాగా వణికిపోతారని చెప్పుకొచ్చింది. తాను అనేక మంది హీరోలతో రొమాంటిక్‌ సీన్లలో నటించానని, అప్పుడు ఆ హీరోలు ఎంత టెన్షన్‌ పడ్డారో తనకి ఇప్పటికీ జ్ఞాపకం ఉందని తెలిపింది. నిజంగా ఒక అమ్మాయితో రొమాన్స్‌ చేస్తున్నట్టు వారు ఫీల్‌ అయ్యారు కాబట్టే అలా టెన్షన్‌ పడ్డారేమో? అన్నట్టు తమన్నా ఓ ఝలక్ ఇచ్చింది కూడా. అయితే ఆమె ఏయే హీరోలను ఉద్దేశించి అలా మాట్లాడిందో మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి.