రాజమౌళి నిజంగా డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాడా? ఆయన అంతరంగం ఇదే!

రాజమౌళి అనేది ఇపుడు ఓ పేరు కాదు, ఓ బ్రాండ్. అవును, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి యావత్ తెలుగునాట మాత్రమే కాకుండా భారతజాతి ఖ్యాతిని దిగంతాలకు చేర్చాడు. RRR సినిమాకు దక్కిన తాజా అవార్డులు ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయి. ఇక జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పైనే ఎక్కువగా దృష్టి సారించాడు. గ్లోబల్ అడ్వెంచర్ గా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు. కాగా ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం రాజమౌళి CCAతో డీల్ కుదుర్చుకున్నారని సమాచారం.

ఇకపోతే, తాజాగా మన జక్కన్న తాను డబ్బుకోసమే సినిమాలు తీస్తాను తప్ప, క్రిటిక్స్ ప్రశంసల కోసం తీయనని చెప్పిన సంగతి అందరికీ విదితమే. అయితే ఈ విషయం చాలామందికి సరిగ్గా అర్ధం కాక ఏమిటేమిటో రాసేస్తున్నారు. ఆయన తన సినిమాలకు డబ్బులు ఖర్చు చేస్తున్న నిర్మాతల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. పెట్టిన రూపాయికి మూడింతలు రాబట్టేలా చూస్తారు. అదే సమయంలో కంటెంట్ పరంగా కూడా ఎక్కడ రాజీ పడరు. తాను అనుకున్నది వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కారు. తెలుగు సినిమా జెండా నలుదిశలా వ్యాపించాలని ఎప్పుడో కంకణం కట్టుకున్నారు.

అదే విషయం RRR విషయంలో తేటతెల్లం అయింది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా త్వరలో ఆస్కార్ కూడా గెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదలై 10 నెలలు కావస్తున్నా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ నేటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి బాక్సాఫీస్ వద్ద మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే రాజమౌళి మహేష్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది.