బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్‌ రికార్డ్.. వీర సింహారెడ్డి కే సొంతం..!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస డిజాస్టర్‌ల‌ తర్వాత 2021 డిసెంబర్‌లో అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేశాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది.

బాలయ్య కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే ఫీట్ నిసెట్ చేసినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ గత సినిమా ఆఖండ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్ ని వీరసింహా రెడ్డి కేవలం వారం రోజుల్లోనే వసూల్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇప్పుడు దీంతో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా ఆయన కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ హీట్ గా నిలిచింది. దీంతో బాలయ్య మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు ఆయన లైప్‌ లో ఉన్నాయి.