స్టైలిష్ దర్శకుడు తో మెగాస్టార్ మూవీ.. మెగా అభిమానులకు పూనకాలే..!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్‌ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. త‌ర్వాత‌ ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి.

ఈ సినిమా తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.. ఇక దీంతో చిరంజీవి అభిమానులు సైతం నిరాశలో మునిగిపోయారు.. కానీ ఇప్పుడు చిరంజీవి వాటన్నిటికీ వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే కమ్‌ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా సంక్రాంతికి వచ్చి టాలీవుడ్ లోనే అదిరిపోయే హిట్‌గా నిలిచింది. ఇక తొలి వారంలోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి భారీ కలెక్షన్లు దిశగా దూసుకుపోతుంది. మెగాస్టార్ ఈ సినిమాలో తన స్ట్రాంగ్ జొన్‌ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో చిరు తర్వాత సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పుడు మెగా అభిమానులు కోరుకునే సెన్సేషనల్ కాంబో రిపీట్ అవబోతున్నట్టు తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ కాంబినేషన్ కూడా కన్ఫర్మ్ అయినట్టు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నా సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరి కాంబోలో గతంలో చారిత్రాత్మక సినిమా అయినా సైరా నరసింహారెడ్డి వచ్చింది. సాధారణంగా సురేందర్ రెడ్డి ఎక్కువగా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల‌ను తన కెరీర్లో తెరకెక్కించాడు. చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి లాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. ఆ సినిమా అవుట్ ఫుట్ బాగున్న ఓవర్ బడ్జెట్ కావటంతో నష్టాలు కలిగాయి.

ఇప్పుడు సురేందర్ రెడ్డి- చిరంజీవి కోసం పక్క మాస్ యాక్షన్ కామెడీ అంశాలతో కూడిన పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి- మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి కూడా అఖిల్ అక్కినేని హీరోగా ఏజెంట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలైన వెంటనే చిరంజీవి సినిమా వర్క్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.