తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని వారుండరు. తన 20 ఏళ్ల సినీ కెరీర్లో అపజయమే ఎరుగని జక్కన్న.. తన సినిమాలతో కొల్లగొట్టిన రికార్డులు కొకల్లు. ప్రస్తుతం ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రంలో చరన్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా కనిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే.. నేడు రాజమౌళి బర్త్‌డే. దాంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రామ్-భీమ్‌లు కూడా రాజమౌళికి స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ తెలిపారు.
డియర్ జక్కన హ్యాపీ బర్త్ డే టు యు. లవ్ యూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. హ్యాపీ బర్త్‌డే రాజమౌళి గారూ అంటూ చరణ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఈ సందర్భంగా ఎన్టీఆర్, చరణ్‌లు ఆర్ఆర్ఆర్ ఆన్‌లొకేషన్ స్టిల్స్ ను సైతం రివిల్ చేశారు. ప్రస్తుతం ఈ స్టిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Happy Birthday dear Jakkana @ssrajamouli. Love you ❤️ pic.twitter.com/pCSTgQB1R9
— Jr NTR (@tarak9999) October 10, 2021
I look up to in many ways & admire the strength he portrays through his simplicity. Happy Birthday Rajamouli Garu. @ssrajamouli 🎉❤️🎂 pic.twitter.com/8tB2EJN7Um
— Ram Charan (@AlwaysRamCharan) October 10, 2021