సాధారణంగా కోపం రానంత వరకు జంతువులు ఎంతో ప్రశాంతగా ఉంటాయి. ఎవరికీ హాని కూడా తలపెట్టవు. కానీ, ఆనందం కోసమో లేదా సరదా కోసమో వాటికి చిర్రెత్తుకొచ్చే పనులు చేశామా.. ఇక అవి ముప్పతిప్పలు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలో ఓ లుంగీ ధరించిన వ్యక్తి.. పాము తోకను పట్టుకుని తలపై కర్రముక్కలతో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఆ పాము వెంటనే పైకి ఎగిరి సదరు వ్యక్తి లుంగీ పట్టేసుకుంది. దాంతో ఒక్కసారిగా షాక్కు గురైన సదరు వ్యక్తం.. పామును వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశాడు.
అయినా ఆ పాము పట్టువీడలేదు. ఇక చివరకు చేసేదేమి లుంగి వదిలేసి.. సదరు వ్యక్తి పురుగులు పెట్టాడు. ఇందంతా ఓ వీడియోలో చిత్రీకరించిన మరో వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి.
Instant Karma 😂 pic.twitter.com/V5q0PokjbC
— Eye Catching (@CatchingPlus) July 22, 2021