ఆ క్రెడిట్ అంతా త‌న‌యుడికే ఇచ్చేసిన రాజ‌మౌళి!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒక‌టి, రెండు పాట‌లు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం మొత్తం ఐదు భాష‌ల్లో విడుదలైన ఈ పాట ప్రతిఒక్కర్నీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సాంగ్ ఐడియా మొత్తం రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయదేనట.

ఈ విషయాన్ని రాజమౌళినే సోమవారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. `ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న‌ప్పుడు దోస్తీ వీడియా సాంగ్ గురించి చెప్పాడు కార్తికేయ. కొరియోగ్రాఫర్‌ సతీష్‌, దినేష్‌కృష్ణన్‌తో కలిసి కార్తికేయ ఈ వీడియో రూపొందించారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో భాషల్లో ఈ పాటను ఆలపించిన అమిత్‌ త్రివేది, అనిరుద్‌, విజయ్‌ యేసుదాసు థ్యాంక్స్‌. పాటకు ఇంత రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు` అని ట్వీట్ చేసి దోస్తీ సాంగ్ క్రెడిట్‌ను త‌న‌యుడికి ఇచ్చేశారు జ‌క్క‌న్న‌.