దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మేకింగ్ వీడియో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ రోర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా వీడియో విడుదలైన గంటల వ్యవధిలోనే యూట్యూబ్ నెంబర్ 1 స్థానంలోకి వచ్చేసింది. అంతేకాదు, 24 గంటలు పూర్తి కాకముందే 6 మిలియన్ కి పైగా వ్యూస్ రాబట్టి.. జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఏదేమైనా, రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో మేకింగ్ వీడియో విడుదల చేసి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు జక్కన్న. కాగా, భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.