పెన్షనర్లకు శుభవార్త..!

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగం సర్వ సాదరణం అయిపోయింది. ఇప్పటికె చాలా మంది వాట్సప్ ద్వారా అనేక పనులు చేసుకున్నారు. తాజాగా పెన్షన్‌ దారుల కోసం నెల నెలా వారి జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలను వాట్సప్ ద్వారా కూడా తెలియచేయాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఈ సమాచారం ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందిస్తున్నారు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని కేంద్రం తెలపడంతో వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉండబోతుంది.

పెన్షన్ దారుల కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తమ జీతం నుంచి జమ అయిన సొమ్ము, పన్ను మినహాయింపుల లాంటి వివరాలన్నీ సులువుగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆదాయపు పన్ను, కరవు భృతి చెల్లింపులు తదితర వివరాలు తెలుకోవడానికి ఉపయోగపడతాయని కేంద్రం తెలియచేసింది.