సౌందర్య కొడుకుగా నటించిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా..? 

ఇండస్ట్రీలో ఎంతోమంది మొదట చైల్డ్‌ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించిన తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమై విదేశాలకు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలు గా రాణిస్తున్నారు. అలా.. ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతోమంది.. అదే కొవ్వకు చెందుతారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌లు అందుకొని స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ లాంటివారు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే.

Suryavamsam' child artist Anand Vardhan to make a comeback after 12 years  as a lead actor | Telugu Movie News - Times of India

ఇక.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రేజీ హీరో.. అదే కోవకు చెందుతాడు. ఎన్నో హిట్ సినిమాలు లో చైల్డ్ ఆర్టిసిగా నటించిన ఈ కుర్రాడు.. అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇతని పేరు ఆనంద్ హర్షవర్ధన్. మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఆనంద్.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్. జగపతిబాబు, సౌందర్య, మహేశ్వరి కలిసి నటించిన ప్రియరాగాలు సినిమాలో సౌందర్య కొడుకుగా నటించి ఆకట్టుకున్నాడు. తర్వాత మీనా, వెంకటేష్ కలిసి నటించిన సూర్యవంశం సినిమాలోని మెరిశాడు.

Nidurinchu jahapana (2025) - IMDb

ఇక ఈ ఆనంద్.. కంపోజర్, ప్లే బాగ్ సింగర్ పివి శ్రీనివాస్ మనవడు కావడం విశేషం. బాలరామాయణంలో వాల్మీకి, బాల హనుమాన్ పాత్రలను పోషించిన ఆనంద్.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఇటీవల హీరోగా మారిన ఆనంద్ హర్షవర్ధన్.. జహాపనా సినిమాతో ఆడియన్స్ను పలకరించాడు. ఇక ఆనంద్ హర్షవర్ధన్ ప్రస్తుతం సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు.