నందమూరి థమన్ కాదు.. NBK థమన్.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా కొల్లి బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న రిలీజైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. అలా సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ప్ర‌పంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళు కొల్లగొట్టినట్లు టీం వివరించారు. అంతేకాదు.. బాలయ్య సినిమాతో వరుసగా నాలుగోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రగ్యా జైస్వాల్, శ్ర‌ధ్ద శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాలయ్య నానాజీ, డాకు మహారాజ్ పాత్ర‌లో త‌న న‌ట‌న‌లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇక సినిమా విజువల్స్, మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాకు థ‌మన‌శ ఇచ్చిన మ్యూజిక్ మరింత హైలెట్ అయింది అంటూ ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమా సక్సెస్ మీట్‌ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ థ‌మన్ బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే దాదాపు 5 సినిమాలు వచ్చి ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ ఐదు సినిమాల్లో మ్యూజిక్ హైలెట్ గా నిల్చింది. దీంతో బాలయ్య అభిమానులంతా మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్‌ను నందమూరి థ‌మన్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ జోడిస్తూ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ.. నందమూరి థ‌మన్ కాదు.. ఎన్బికె థ‌మన్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్‌కు సరికొత్త పేరును జోడించారు. డాకు మహారాజ్ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి.