ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించిన తర్వాత వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. వారి సినిమాల విషయాల్లోనే కాదు.. పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు జనం. ఇలాంటి క్రమంలోనే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కచ్చితంగా బయటకు వెళ్లాలంటే తమతో తీసుకువెళ్లే వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాం.
రామ్ చరణ్:
మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌తో తాజాగా ఆడియన్స్‌ను పలకరించిన ఆయన.. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే రామ్ చరణ్ ఏదైనా ఈవెంట్‌లకు లేదా.. సినిమా షూట్‌కు వెళ్ళేటప్పుడు కచ్చితంగా తనతో పాటు తన కుక్క పిల్ల రైమ్ ని కూడా తీసుకువెళ్తాడట. ఇటీవల సింగపూర్ లోని మేడంటుసాడ్‌లో కూడా చరణ్ బొమ్మతో పాటు ఆ కుక్కపిల్ల మైనపు బొమ్మను ఉంచిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టే చరణ్ దాన్ని ఎంతలా బయటకు తీసుకువెళ్తాడో తెలుస్తుంది.
ప్రభాస్:
పాన్ ఇండియా రెబల్ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్.. ఇతరులకు భోజనం పెట్టడం అన్నా.. తాను ఫుడ్ తినడం అన్నా.. ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తినడం ప్రభాస్‌కు కచ్చితంగా అలవాటటా. ఈ క్రమంలోనే ప్రభాస్ బయట ఫుడ్ తినకుండా ఇంట్లో నుంచి ఆహారాన్ని కచ్చితంగా తీసుకువెళ్తాడని తెలుస్తుంది. తను బయటకు వెళ్ళినప్పుడు తనతో పాటు ఇంటి ఫుడ్ కూడా ప్రభాస్ వెంటే ఉంటుందట.
అల్లు అర్జున్:
పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే అల్లు అర్జున్‌కు కూడా బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా తన వెంట కెమెరాను తీసుకువెళ్లే అలవాటు ఉందని తెలుస్తుంది. అల్లు అర్జున్‌కు ఫోటోలు తీయడం అంటే ఎక్కువగా ఇష్టమట. అందుకే ఆయన షూటింగ్ లోకేషన్లకు వెళ్లిన, ఈవెంట్లకు వెళ్లిన ఎక్కువగా తనతో పాటు కెమెరాను తీసుకువెళ్తాడని సమాచారం.