ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్ల సినిమాలపై రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో స్టార్ హీరోలు మొదలుకొని.. చిన్న హీరోల వరకు అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో తెలిసిందే. ఆ సినిమాలను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ దానిని డి గ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుద్ధంలో మరో ప్రెస్టేజ్ మూవీ కూడా రంగంలోకి దిగింది. మరోసారి ఈ సినిమా విషయంలో వార్ తప్పని పరిస్థితి నెలకొంది.
మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్2 ప్రస్తుతం షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు.. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌లో సినిమా విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. తారక్ ఎలాంటి రోల్‌లో నటిస్తున్నాడో తెలుసుకోవాలని ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే సినిమాలో తారక్ రోల్ ఏమాత్రం తేడా కొట్టినా.. సోషల్ మీడియాలో యాంటీ తారక్ ఫ్యాన్స్ ట్రోలింకు దిగడం ఖాయం.
విపరీతంగా ఆయన పాత్రను ఆడేసుకుంటారు. గతంలో తను నటించిన దేవర సినిమాకి కూడా నెటింట విపరీతమైన ట్రోల్స్ ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్ 2లో తన పాత్రను ప్రజెంట్ చేసే తీరులో ఏదైనా గట్టిగా ప్లాన్ చేస్తేనే తప్ప.. ఈ ట్రోలింగ్‌కు గురికాకుండా ఉండడం అసాధ్యం. మరి వార్ 2లో తారక్ ఎలా కనిపించనున్నాడు.. యాంటీ ఫ్యాన్స్ కు ట్రోలింగ్ స్టఫ్ కాకుండా తప్పించుకోగలడా.. లేదా.. అనేది ప్రస్తుతం నెటింట మట్ టాపిక్‌గా మారింది. ఇక తారక్‌లో ఏ చిన్న మిస్టేక్ కనిపించినా.. మళ్లీ సోషల్ మీడియాలో వార్ తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.