ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ స‌ర‌సన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఐశ్వర్య రాజేష్‌ తెలుగు ఫ్యామిలీ అమ్మాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.

తండ్రీ రాజేష్ అప్పట్లోనే మంచి నటుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగాను ఎన్నో సినిమాల్లో నటించారు. వరుస‌ సక్సెస్‌లను అందుకున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు సినిమాల్లోనూ కనిపించాడు. ఇక హీరోగా, విలన్ గాను మెప్పించాడు రాజేష్. అయితే చిన్న వయసులోనే ఆయనం మృతి చెందారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాలో నటించారు. ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. రాజేంద్రప్రసాద్ నటించిన రామబంటు సినిమాలో ఐశ్వర్యరాజేష్ బాలనటిగా నటించి మెప్పించింది. ఇందులో ఓ చిన్న రోల్లో ఆమె ట‌క్కున‌ మెరిసింది. ఏమో గుర్రం ఎగ‌రావచ్చు అనే పాటలో బేబీ ఐశ్వర్య కాసేపు కనిపిస్తుంది.

రాజేంద్రప్రసాద్ కూతురుగా ఆమె మెప్పించింది. బాపు డైరెక్షన్లో వ‌చ్చిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కు జోడిగా ఈశ్వరీరావు హీరోయిన్గా కనిపించింది. 1985లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇందులో కామెడీతోనే కాదు, యాక్షన్స్ తోను రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నాడు. అయితే ఐశ్వర్య కేవలం ఆ ఒక్క సినిమాలో మాత్రమే బాలనాటిక మెరిసింది. తర్వాత తమిళ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించింది. అయితే అమ్మడి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందిన‌.. సినిమాలు సరైన రిజల్ట్ రాలేదు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అమ్మడుకి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.