తెలుగు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన విశ్వంభర సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విశిష్ట డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు సిద్ధం కాకముందే.. చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేసుకున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో సినిమా అనౌన్స్ చేసిన ఆయన.. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోను సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా షేర్ చేసుకున్నారు. తను దర్శకుడిగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేసిన అనీల్ రావిపైడి.. ఈ సినిమా రిలీజ్ తర్వాత చిరును కలిసి ఆయనకు ఎలాంటి కథ కావాలనే విషయాన్ని మాట్లాడుతానని.. దానికి తగ్గట్టుగా కథను రెడీ చేసే పనిలో ఉంటామంటూ అనిల్ రావిపూడి వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రూపొందించేలా ప్లాన్ చేసుకుంటానని అనీల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇక అనీల్ గత ఏడాది దసరా కానుకగా నందమూరి నటసింహం బాలకృష్ణతో యాక్షన్ ,ఎమోషనల్ ఎంటర్టైనర్ గా భగవంత్ కేసరి సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
అప్పటివరకు కేవలం కామెడీ జోనర్‌లోనే సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న అనిల్.. యాక్షన్ కథ తోను బ్లాక్ బస్టర్ అందుకుని.. తన సత్తా చాటుకున్నాడు. అన్ని జోనర్లలో తన సినిమా చేయగలరని నిరూపించాడు. అంతేకాదు ఈ సంక్రాంతి బరిలో రానున్న వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై కూడా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం హిట్ గ్యారెంటీ అన్న అభిప్రాయాలు అంత వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో.. చిరు కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు.. ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువస్తారో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.