నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4.. ఎపిసోడ్ 8లో బాలయ్య డాకు మాహరాజ్ టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ హాజరయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్ళతో ముచ్చటించిన బాలయ్య.. థమన్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు. మీ ఇద్దరూ అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు అనే ప్రశ్న థమన్ అడగగా.. ఇద్దరిని గారాబంగానే పెంచా అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ మణిరత్నం గారు అప్పట్లో ఓ సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణిని అడిగారంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయాన్ని ఆమెకు చెబితే మై ఫేస్( నా ముఖం) అందని.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని చెప్పా.. చివరకు ఆసక్తి లేదని చెప్పేసా అంటూ వివరించాడు. తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ నటించేది. తనైనా మంచి నటి అవుతుందని భావించా.. చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ షోకి క్రియేట్ కన్సల్టెంట్.. ఎవరి రంగంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు అంటే అంతకుమించి నాకు కావాల్సిందేముంది అంటూ బాలయ్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ చెశారు.
యాక్టర్ కంటే హోస్ట్‌గా ఉండడమే ఇష్టం అంటూ మరో ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ బాబీ, బోయపాటి ఇద్దరిలో ఫేవరెట్ ఎవరు అని అడగగా.. ఇద్దరు నా ఫేవరెట్ అంటూ వెల్లడించాడు. యాక్షన్ సీక్వెన్స్ కంటే రొమాంటిక్ సీన్స్ ఇష్టమంటూ వివరించాడు. ఇక ఇదే షోలో నాగ వంశీ కూడా డాకు మహారాజ్‌తో పాటు తన సినిమాలకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం నారా బ్రాహ్మణి మణిరత్నం సినిమా ఛాన్స్ రిజెక్ట్ చేసిందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బ్రాహ్మణి అందానికి నిజంగానే హీరోయిన్గా అడుగుపెట్టి ఉంటే ఇప్పటికీ ఇండస్ట్రీని ఏలేసేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.