ఈ కుర్రాడు ఒకప్పటి టాలీవుడ్ విలన్.. ఇప్పుడు పాన్ ఇండియన్ సెన్సేషనల్ హీరో.. గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ఇత‌నో టాలీవుడ్లో విలన్. తెలుగులో పలు సినిమాలో నటించే ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. ఓ ప‌క్క ప్లే బాక్స్ సింగర్ గా, ప్రొడ్యూసర్ గా, ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలో ఇటీవల ఈ హీరో పేరు తెగ వైరల్ గా మారుతుంది. దానికి కారణం అతను నటించిన ఒకే ఒక్క మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలనం సృష్టించింది.

Janatha Garage (2016)

రికార్డ్ కలెక్షన్లను కల్లగొట్టింది. అన్నిటికి మించి.. మన దేశంలో ఇప్పటివరకు ఎలాంటి మూవీ రాలేదు. గతేడాది రిలీజ్ అయిన కిల్‌కు మించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే సౌత్ ఆడిచ‌న్స్‌తోపాటు.. నార్త్‌ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటికే రూ.100 కోట్లకు చేరువైంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో అర్థమయిపోయి ఉంటుంది. అదే మార్కో. ఇందులో హీరో.. ఉన్ని ముకుందన్‌ గురించి మనం చెప్పుకుంటుంది. ఇది అతని టీనేజ్ నాటి ఫోటో. మార్కో తో రికార్డులు క్రియేట్ చేస్తున్న క్రమంలో.. ఇప్పుడు ఉన్ని ముకుందన్‌ చిన్ననాటి ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.

Unni Mukundan's 'Marco' set to release this year | - Times of India

ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయన.. ఎన్నో తెలుగు సినిమాల్లోనూ ఆకట్టుకున్నాడు. జనతా గ్యారేజ్‌లో నెగిటివ్ రోల్‌లో మెప్పించాడు. అనుష్క భాగమతిలోను కీలక పాత్రలో కనిపించాడు. రవితేజ కిలాడి, సమంత యశోద ఇలా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నాడు. మళ్ళీ కాపురం లాంటి సినిమాల్లో హీరోగా నటించిన ముకుందన్‌.. ఇప్పుడు మార్కోతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషలను రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి యాక్షన్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రూ.100 కోట్ల చెరువులో కలెక్షన్లతో దూసుకుపోతుంది.