సప్త సాగరాలు దాటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న రుక్మిణి వశంత్‌కు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోకపోయినా.. అమ్మడికి మాత్రం మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తన అందం, అభినయం, ట్రెడిషనల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలో రెండు బడా ప్రాజెక్టులలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. వాటిలో ఒకటి ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ కాంబో, కాగా.. రెండవది కాంతార 2 దాంతో పాటు మరో నాలుగైదు సినిమాల్లో అమ్మడు కనిపించనుంది. ఇక తారక్ సినిమాలో హీరోయిన్ అంటే దాదాపు స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసినట్టే.. పైగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో నటించనుంది.
అలాగే కాంతార 2 లో మెరవనుంది. ఈ క్రమంలోనే.. రుక్మిణి స్టార్ డం ఏంటో తేలిపోతుంది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం రుక్మిణికి తారక్ సినిమా కొత్త చిక్కులు తెచ్చి పెట్టిందట. అదేంటంటే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పూర్తి అయ్యేవరకు రుక్మిణి మరో సినిమాకు చేయకూడదని ఈ ప్తాజెక్ట్ అగ్రిమెంట్‌లో రాసి ఉందట. ఇక ప్రశాంత్ ప్రస్తుతం ప్రాజెక్టును చాలా స్లోగా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రుక్మిణి డేట్స్ ఆయనకు ఎప్పుడు కావాలో.. ఎప్పుడు సినిమా చేశ్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి అందరినీ ముందుగానే లాక్ చేసేసాడు ప్రశాంత్. ఇక కాంతర 2 విషయంలోనూ ఇదే అగ్రిమెంట్ ఉంది.
ఈ క్రమంలోనే తను రెండు సినిమాలు అయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదు. దానికి ఈ అమ్మడు ఓకే చెప్పి సైన్ కూడా చేసేసిందట. ఇలాంటి క్రమంలో ఇప్పుడు అమ్మే కమిటైన నాలుగు చిన్న సినిమాల మేకర్స్.. అమ్మడీ డేట్ల కోసం క్యూ కట్టారట. ఎన్టీఆర్ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే.. ఇలాంటి వాటిపై రుక్మిణి ఆలోచించి ఉండాల్సిందని.. డిసైడ్ అవ్వాల్సిందని.. మిగిలిన సినిమాలు చేయకూడదని కండిషన్ పై ఆలోచించి ఉండాల్సిందని తెలుస్తుంది. వచ్చిన అడ్వాన్స్‌లని అందుకున్న రుక్మిణి.. ఇప్పుడు వాళ్లకుబ డేట్స్ ఇవ్వలేక.. మరొ పక్క సమాధానం చెప్పలేక ఇబ్బందుల్లో పడిపోయిందట.