ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన్న.. తర్వాత గ్లోబల్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్మిక పేరు మారుమోగిపోతుంది. శ్రీవల్లిగా అమ్మడి ఇమేజ్ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర రపరప రికార్డులను క్రియేట్ చేస్తుంది.
రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి ఇండియన్ మూవీ గా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ సినిమాలో.. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ నటనకు ఏ రేంజ్‌లో క్రేజ్ వచ్చిందో తెలిసిందే. అంతకు డబల్ రేంజ్‌లో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన పేరు కూడా మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత.. రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారం. అయితే ఆమెకు వచ్చిన ఇమేజ్‌ను దుర్వినియోగం చేసుకోకుండా.. వచ్చిన సినిమాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఆచితూచి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను రష్మిక ఎంచుకుంటుందని సమాచారం.
కాగా.. పుష్ప 2 కోసం.. రష్మిక దాదాపు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని.. గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెరీర్‌లో ఎన్నో సినిమాలు నటించినా రష్మక పుష్ప 2 రేంజ్ రెమ్యునరేషన్ మరే సినిమాకు తీసుకోలేదని సమాచారం. కాగా ఈ మూవీ కోసం అమ్మడు తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా తన ఫేవరెట్ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ఖర్చుపెట్టిందట. ముంబైలో బిజీ ఏరియాలో రష్మిక మందన మంచి ప్లాట్ కొనుక్కోవాలని ఎప్పటినుంచో అనుకునేదట. ఈ క్రమంలో ఫ్లాట్ కొని రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.